Under the watchful eyes head coach Ravi Shastri, the Indian cricket team held its first training session at the Gabba on Sunday. Brisbane will play host to the first T20I of the three-match series which is scheduled to be played on Wednesday.
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బుధవారం జరిగే మొదటి టీ20తో సిరీస్‌ను ఆరంభం చేయనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయర్లు సోమవారం,మంగళవారం కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఆదివారమే గబ్బా స్టేడియం వేదికగా తొలి రోజులో భాగంగా ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. రెండో రోజు కూడా కోహ్లీ సేన నెట్స్‌లో పాల్గొంది. కోహ్లీతో పాటు ధావన్, రాహుల్‌లు కూడా కొంత సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బౌలర్ బుమ్రా కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం విశేషం. ఇక మరోపక్క ఆస్ట్రేలియా జట్టు కూడా చెమట చిందిస్తోంది.సొంతగడ్డపై ఆస్ట్రేలియాను అంత తక్కువ అంచనా వేయలేం. తమ గడ్డపై సరైన రికార్డు లేని భారత్‌ను ఓడించి తిరిగి ఫామ్ అందుకోవాలని ఆ జట్టు చూస్తోంది. వన్డే ప్రపంచకప్ తమ స్థాయిని నిలబెట్టుకోవడానికి ఇదే సరైన సమయమని వేచి చూస్తోంది. సాధారణంగా ఆస్ట్రేలియాలో భారత పర్యటన టెస్టులతోనే మొదలవుతుంది కానీ.. ఈసారి కొంచెం భిన్నం. ముందు టీ20 సిరీస్ జరగనుంది. తర్వాత టెస్టులు ఆడి.. చివరగా వన్డే సిరీస్‌లో తలపడుతుంది టీమిండియా.
#IndiavsAustralia
#indvsaus1stt20
#rohitsharma
#TeamIndiaPractice